వెంటిలేటర్‌పై ఫిష్ వెంకట్.. పరిస్థితి విషమం!
on Jul 1, 2025
సినిమా రంగంలో ఒక వెలుగు వెలిగిన కొందరు.. చివరి దశలో దీనావస్థకి రావడం గత కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. ఎన్నో కన్నీటి గాధల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే నటుడు ఫిష్ వెంకట్‌కి వచ్చింది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతను వెంటిలేటర్‌పై ఉన్నారు. వైద్యులు చికిత్స చేస్తున్నారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో వైద్య ఖర్చుల కోసం సహాయాన్ని అర్థిస్తున్నారు కుటుంబ సభ్యులు.
తెలుగు సినిమాల్లో ఎస్ బాస్ వంటి క్యారెక్టర్లు చెయ్యడంలో ఫిష్ వెంకట్‌కి మంచి పేరు ఉంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అతను తన యాస, నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2000లో సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటివరకు వందలాది సినిమాల్లో నటించారు. స్టార్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అనుభవం ఈ కామెడీ విలన్ సొంతం. తన నటనతో అందర్నీ నవ్వించిన వెంకట్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అతను చివరగా చేసిన సినిమా నరకాసుర. అనారోగ్యం కారణం వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. దీంతో అతని కుటుంబం ఆర్థికంగా దెబ్బతింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



