ఇక్కడ ఉంది పవన్ కళ్యాణ్ అభిమాని.. పుష్పలో ఆ క్యారక్టర్ గురించి నిజం చెప్పేసింది
on Jul 1, 2025
పాన్ ఇండియా వ్యాప్తంగా 'కాంతార'(Kantara)మూవీ సాధించిన ఘన విజయం తెలిసిందే. ఈ మూవీలో 'లీల' అనే క్యారక్టర్ ద్వారా అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ ని ప్రదర్శించి, ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న నటి సప్తమి గౌడ(Sapthami Gowda). ఈ నెల 4 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్(Nithiin),వకీల్ సాబ్ డైరెక్టర్ 'వేణుశ్రీరామ్'(Venu sriram)ల 'తమ్ముడు'(Thammudu)మూవీతో తెలుగు తెరకి తొలిసారి పరిచయం కాబోతుంది. ఈ సందర్భంగా సప్తమి గౌడ పలు విషయాలని మీడియాతో పంచుకుంది.
ఆమె మాట్లాడుతు తమ్ముడు మూవీలో మహిళా క్యారక్టర్ లు చాలా బలంగా ఉంటాయి. మూవీ చూసిన మహిళా ప్రేక్షకులు ఈ విషయంలో చాలా సంతోషిస్తారు. నేను 'రత్న' అనే క్యారక్టర్ లో పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తున్నాను. మూవీ మొత్తం సీరియస్ సబ్జెట్ అయినా, నా క్యారెక్టర్ మాత్రం నవ్వులు పూయిస్తుంది. ఒక ప్రేమ కథని కూడా డైరెక్టర్ నా క్యారక్టర్ కి డిజైన్ చేసారు. క్యారక్టర్ డిమాండ్ మేరకు అరకు కొండల్లో, గుట్టల్లో గుర్రపు స్వారీ చేశాను. ఆ కష్టం మొత్తం సినిమా విజయంతో మర్చిపోతాను. నితిన్ తో నటించడంతో పాటు దిల్ రాజు బ్యానర్ లో తెలుగు సినిమాకి పరిచయం కావడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లీ క్యారక్టర్ లాంటివి చెయ్యాలనేది నా కోరిక. అలాంటి అవకాశాలు వస్తే వదులుకోనని చెప్పుకొచ్చింది.
కన్నడ చిత్ర రంగానికి చెందిన సప్తమి గౌడ 2020 లో 'పాప్ కార్న్ మంకీ టైగర్' అనే కన్నడ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 'కాంతార' తో పాటు హిందీలో 'ది వ్యాక్సిన్ వార్' అనే చిత్రంలో చేసింది. 'ది కాశ్మీరీ ఫైల్స్' తో పాటు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తెరకెక్కించిన 'వివేక్ అగ్నిహోత్రి'(Vivek Agnihotri)ఆ చిత్రానికి దర్శకుడుగా వ్యవహరించాడు. ప్రస్తుతం సప్తమి గౌడ తెలుగులోనే మరో రెండు చిత్రాలకి ఒకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
