
-సిటాడెల్ సీజన్ 2 వచ్చేస్తుంది
-సిటాడెల్ సంచలనం తెలుసుగా
-మరి ఎప్పుడు
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(priyanka Chopra)ప్రస్తుతం మహేష్(Mahesh),రాజమౌళి(Rajamouli)ల 'వారణాసి'(varanasi)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. తన రాకతో వారణాసికి వరల్డ్ స్థాయిలో మరింత క్రేజ్ ఏర్పడిందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు మరోసారి వరల్డ్ వైడ్ గా 'సిటాడెల్ సీజన్ 2 ' తో సందడి చేయనుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
సిటాడెల్ సీజన్ 2(Citadel season 2).. గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన సిటాడెల్ కి కొనసాగింపుగా రూపుదిద్దుకుంది. తాజాగా మేకర్స్ సీజన్ 2 ట్రైలర్‌ని రిలీజ్ చేయడంతో పాటు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6 న స్ట్రీమింగ్ కానుంది. ఈ సారి స్పెషల్ ఏంటంటే అన్ని ఎపిసోడ్లు ఒకేసారి స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ విషయాన్నీ కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దాదాపు 240 దేశాలలో పలు భాషల్లో రిలీజ్ కానుండగా తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు డబ్బింగ్ లో కూడా రిలీజ్ కాబోతుంది.
Also read: Jailer 2: జైలర్ 2 కంప్లీట్.. ఏ డేట్ కావాలి
రిలీజైన ట్రైలర్ చూస్తుంటే, మొదటి సీజన్ కంటే కూడా సీజన్ 2 లో యాక్షన్ డోస్ మరింత పెరిగినట్లు కనిపిస్తోంది. గూఢచారి వ్యవస్థకు సంబంధించిన లోతైన కుట్రలు, అదిరిపోయే ఛేజింగ్ సీన్స్, హై-వోల్టేజ్ ఫైట్స్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నాయి. 'నాడియా సిన్'గా ప్రియాంక చోప్రా, 'మేసన్ కేన్'గా రిచర్డ్ మాడెన్ తమదైన స్టైల్లో మరోసారి అదరగొట్టానోతున్నారు. 'మాంటికోర్' అనే శక్తివంతమైన నెట్‌వర్క్‌ని ఎదుర్కోవడానికి స్పై టీమ్ చేసే పోరాటమే సీజన్ 2 ప్రధాన ఇతివృత్తం. జో రూసో దర్శకత్వంలో రూసో బ్రదర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మరి మొదటి సీజన్ మిగిల్చిన సస్పెన్స్‌కి ఈ సీజన్‌లో సమాధానం దొరుకుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.
.webp)






