Home

»

Latest News

SRH మ్యాచ్ కోసం మెట్రో జర్నీ చేసిన ప్రముఖ తెలుగు హీరో!

Apr 22, 2026

రీసెంట్ గా హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులకు ఒక మరుపురాని అనుభవం ఎదురైంది. సాధారణ ప్రయాణికులతో కలిసి సీనియర్ హీరో, 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ (Sai Kumar) మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH vs DC ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఆయన మెట్రోలో ప్రయాణించడం విశేషం.

తన మెట్రో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను సాయి కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. "నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH vs DC మ్యాచ్ కోసం మొదటిసారి మెట్రోలో ప్రయాణించాను. ఫ్యాన్ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది" అంటూ ఆయన తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. మాస్క్ ధరించి, సాధారణ క్యాప్ పెట్టుకుని ఎంతో నిరాడంబరంగా ఆయన మెట్రోలో ప్రయాణించడం విశేషం.

ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ కావడంతో ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది. ఈ క్రమంలో సెలబ్రిటీలు సైతం ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి మెట్రోను ఆశ్రయించడం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. సాయి కుమార్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com