
-జైలర్ పార్ట్ 1 హిట్ తో పార్ట్ 2 పై భారీ అంచనాలు
-రీసెంట్ గా షూటింగ్ కంప్లీట్
-సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హంగామా
కొన్ని చిత్రాలకి సీక్వెల్స్ కావాలని, రాకపోతే పద్దతిగా ఉండదనే డిమాండ్ వస్తుంది. అలాంటి అరుదైన మేలు రకం మూవీ జైలర్(Jailer)..ఈ చిత్రం సాధించిన సంచలన విజయం అంతా ఇంతా కాదు. వరుస ప్లాప్స్ తో ఏంటి రాజా పరిస్థితి అనుకుంటున్న రజినీకాంత్(Rajini Kanth)కి, ఈ సారి హిట్ రాకపోతే సినీ డైరీ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి అనుకుంటున్న నెల్సన్(Nelson Dilip Kumar)కి సరికొత్త సినీ జన్మనిచ్చిందని చెప్పవచ్చు. అందుకే అభిమానుల, ప్రేక్షకుల డిమాండ్ కి తలొగ్గి జైలర్ 2 ని తెరకెక్కించే మహత్ కార్యక్రమానికి పూనుకున్నారు.
ఇప్పుడు ఈ మూవీకి చిత్ర యూనిట్ నిన్నటితో గుమ్మడి ఖాయ కొట్టింది. ఈ మేరకు రజినీకాంత్ , నెల్సన్ సెండ్ ఆఫ్ కేక్ ని కట్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీంతో త్వరగా రిలీజ్ చెయ్యండి సౌత్ సినీ ఎట్మా స్పియర్ డల్ గా ఉందనే కామెంట్స్ తో అభిమానులు, నెటిజన్స్ సోషల్ మీడియాకి నయా జోష్ తెస్తున్నారు. జైలర్ 2 ని జైలర్ ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో నెల్సన్ తెరకెక్కించాడు. ఈ నేపథ్యంలో కథ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది.
also read: Sai pallavi: వివాదంలో సాయిపల్లవి.. ఆ భాషలో మాట్లాడితే కోపం వస్తుందా!
మొదటి భాగంలో అవినీతి పరులతో చేతులు కలిపి తననే చంపాలని చూసిన కన్న కొడుకైన పోలీస్ ఆఫీసర్ ని మాజీ పోలీస్ అధికారి ముత్హు వెల్ పాండియన్ (రజనీకాంత్) చంపిన విషయం తెలిసిందే. పార్ట్ 2 ని కూడా పార్ట్ 1 ని నిర్మించిన సన్ పిక్చర్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుంది. మరో స్టార్స్ మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కీలకమైన క్యారెక్టర్స్ పోషిస్తుండగా రజినీకాంత్ వైఫ్ గా రమ్య కృష్ణ మరో సారి సెల్యులాయిడ్ పై కనువిందు చేయనుంది. అనిరుద్ మ్యూజిక్ .







