మనవడి కోసం వెయిటింగ్!
on Nov 8, 2018
.jpg)
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాతయ్య కాబోతున్నారు. ఆయన ద్వితీయ పుత్రిక శ్రీజ, చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్ దంపతులు త్వరలో తమకు రెండో సంతానం కలగనున్నట్టు ప్రకటించారు. ఇటీవల శ్రీమంతం జరిగిందని ఫిలింనగర్ వాసులు తెలిపారు. మెగా ఫ్యామిలీ అంతా సంతోషంలో మునిగింది. త్వరలో తమ ఇంట అడుగుపెట్టబోయే చిన్నారి కోసం ఎదురు చూస్తున్నారు. మరో పక్క మెగాభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు... మెగాస్టార్ ఇంట మనవడు పుడతాడా? మనవరాలు పుడుతుందా? అని! మెగా మనవడి కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అమ్మాయిలను, ఆడపిల్లలను తక్కువ చేసి చూస్తున్నారా? అంటే... కానే కాదు. మెగాస్టార్ పెద్దమ్మాయి సుష్మితకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్నమ్మాయి శ్రీజకు తొలి కాన్పులో ఆడపిల్ల. మెగాస్టార్ ఇంట ముచ్చటగా ముగ్గురు లక్ష్మీదేవులు వున్నారు. ఒక అబ్బాయి అడుగు పెడితే బావుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. శ్రీజకు అమ్మాయి పుడుతుందో? అబ్బాయి పుడతాడో? వెయిట్ అండ్ సీ!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



