హిందీలోకి నిత్యా... మిషన్ మంగళ్!
on Nov 8, 2018
.jpg)
క్యారెక్టర్ డిమాండ్ చేసిందనో... రెమ్యునరేషన్ ఎక్కువ అనో... ఏదో ఒక సినిమాలో గ్లామర్ వొలకబోసిన కథానాయికలు ఎంతోమంది కనిపిస్తారు. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా తమకు నచ్చిన కథల్లో నటిస్తున్న అతికొద్ది మంది కథానాయికల్లో నిత్యా మీనన్ ఒకరు. ఇప్పటి వరకూ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నటించిన నిత్యా మీనన్, ఇప్పుడో హిందీ సినిమాకు సంతకం చేశారు. అందులోనూ నటనకు ప్రాధాన్యత అయిన పాత్రే అయ్యి వుంటుంది. అక్షయ్ కుమార్ హీరోగా నటించనున్న హిందీ సినిమా 'మిషన్ మంగళ్'. ఇందులో నలుగురు హీరోయిన్లు. నలుగురిలో నిత్యా మీనన్ ఒకరు. విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సి మిగతా కథానాయికలు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. 'జనతా గ్యారేజ్', 'అ!' సినిమాల తరవాత తెలుగులో కథానాయికగా మరో సినిమాకు నిత్యా మీనన్ సంతకం చేయలేదు. ఎన్టీఆర్ బయోపిక్‌లో సావిత్రిగా అతిథి పాత్రలో కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



