Home

»

Latest News

మెగాస్టార్ `విజేత‌`కి సీక్వెల్ ప్లాన్?

Nov 22, 2021 2:27PM

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే సినిమాల్లో `విజేత‌` ఒక‌టి.  చెల్లెలి పెళ్ళి కోసం కిడ్నీ అమ్మే ఓ త్యాగ‌మూర్తి అయిన అన్న క‌థ‌గా `విజేత‌` రూపొందింది. చిరంజీవి టైటిల్ రోల్ లో న‌టించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ ని గీతా ఆర్ట్స్ ప‌తాకంపై అల్లు అర‌వింద్ నిర్మించ‌గా.. అగ్ర ద‌ర్శ‌కుడు ఎ. కోదండ‌రామి రెడ్డి తెర‌కెక్కించారు. 1985లో రిలీజైన ఈ సినిమా అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది.

క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో ఈ సినిమాకి సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. అంతేకాదు.. `ఎన్టీఆర్` బ‌యోపిక్, `త‌లైవి`, `83` చిత్రాల నిర్మాత‌ల్లో ఒక‌రైన విష్ణు ఇందూరి ఈ సీక్వెల్ ని నిర్మిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ద‌ర్శ‌కుడు, ఇత‌ర వివ‌రాలు కూడా త్వ‌ర‌లోనే వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముందంటున్నారు. మ‌రి.. ఈ క‌థ‌నాల్లో వాస్త‌వ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.  

ఇదిలా ఉంటే.. చిరు తాజా చిత్రం `ఆచార్య‌` ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అలాగే `గాడ్ ఫాద‌ర్`, `మెగా 154`, `భోళా శంక‌ర్`.. ఇలా మ‌రో మూడు చిత్రాల‌తో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. అదే విధంగా మారుతి, వెంకీ కుడుముల‌తోనూ చిరు సినిమాలు ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్త‌మ్మీద‌.. మెగాస్టార్ వ‌రుస చిత్రాల‌తో అభిమానుల్లో జోష్ నింపుతున్నార‌నే చెప్పాలి.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com