త్వరలో మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ
on Jul 7, 2022
మెగాస్టార్ చిరంజీవి ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన 'ఆచార్య' మూవీ డిజాస్టర్‌గా నిలిచి డిజప్పాయింట్ చేయడంతో, ఇప్పుడు ఆయన తన తదుపరి చిత్రం 'గాడ్‌ఫాదర్' మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ మూవీ వచ్చే దసరా పర్వదినం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఆ తర్వాత బాబీ డైరెక్ట్ చేస్తోన్న మెగా 154, మెహర్ రమేశ్ రూపొందిస్తోన్న 'భోళా శంకర్' సినిమాలు రానున్నాయి.
లేటెస్ట్ బజ్ ప్రకారం త్వరలో ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పేరుపొందిన రెండు ఓటీటీ దిగ్గజ సంస్థలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాయంటున్నారు. వాటి ద్వారా వచ్చిన స్క్రిప్టులు చూస్తున్న ఆయన, మంచి స్క్రిప్టుతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.
ఆయన గనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఇండస్ట్రీలో ఇది సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఆయన నుంచి ఎలాంటి కబురు అందుతుందా అని వెయిట్ చేస్తున్నారు. తన వయసును దృష్టిలో ఉంచుకొని, రియాలిటీకి దగ్గరగా ఉన్న కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్లాలని చిరంజీవి భావిస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
