పదిహేనేళ్లుగా కోలీవుడ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న రామ్!
on Jul 7, 2022
రామ్ పోతినేని 2006లో 'దేవదాసు' మూవీతో హీరోగా పరిచయమై, తొలి చిత్రంతోటే నటునిగా తన ఎనర్జీ లెవల్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచి ఆకట్టుకున్నాడు. పదిహేనేళ్లు గడిచిపోయాయి. టాలీవుడ్‌లోని పాపులర్ స్టార్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకున్న అతను ఇప్పుడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో అతను హీరోగా నటించిన 'ది వారియర్' మూవీ తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపొందింది. జూలై 14న ఈ మూవీ రిలీజవుతోంది. బుధవారం చెన్నైలో జరిగిన తమిళ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు మణిరత్నం, శంకర్, భారతీరాజా లాంటి లెజెండరీ డైరెక్టర్స్‌తో పాటు, ఎస్.జె. సూర్య, సెల్వమణి, విశాల్ లాంటి ప్రముఖులు అతిథులుగా వచ్చారు. ది వారియర్ హిట్ కావాలని ఆకాంక్షించారు.
ఈ ఈవెంట్లో రామ్ పోతినేని మాట్లాడుతూ ‘‘కోలీవుడ్ ఎంట్రీ కోసం 15 ఏళ్లుగా వెయిట్ చేశాను. అయితే ఈ రేంజ్ ఇంట్రడక్షన్ ఉంటుందని అస్సలు ఊహించలేదు. నాకే కాదు.. ఇండియన్ సినిమాల్లోనే ఇంత మంది లెజెండ్స్ ఏ సినిమాకు కూడా వచ్చి ఉండరు. అది లింగుస్వామిగారి వల్లనే సాధ్యమైంది. ఇక్కడకు వచ్చిన ఒక్కొక్క గెస్ట్‌ను చూస్తే లింగు స్వామిగారు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు సాధించినట్లే అనిపిస్తుంది. ఆయన్ని వ్యక్తిగా ఎంత ఇష్టపడుతున్నారో ఈ వేదికను చూస్తే అర్థమవుతుంది. ఇంత గొప్ప డెబ్యూతో తమిళ్ ఎంట్రీ ఇస్తున్నందుకు ఆశీర్వాదంగా భావిస్తున్నాను." అని చెప్పాడు.
"బుల్లెట్ సాంగ్ మాత్రమే కాదు.. ప్రతీ సాంగ్‌ను దేవిశ్రీ ప్రసాద్ ఎక్సలెంట్‌గా ఇచ్చాడు. ఆ సాంగ్‌ను పాడిన శింబుకి స్పెషల్ థాంక్స్. అలాగే ఆది పినిశెట్టి నాకు సోదర సమానుడు. తను మంచి హీరో. అయితే ఓ క్యారెక్టర్‌ను విని దాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడమనేది చాలా గొప్ప విషయం. ఆది ఈ సినిమాలో సగ భాగం. తను ఈ పాత్ర చేసినందుకు థాంక్స్. కృతికి కూడా తమిళంలో ఇది డెబ్యూ మూవీ. నదియా గారితో కలిసి వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. నిర్మాత శ్రీనివాసా చిట్టూరిగారు చాలా మంచి వ్యక్తి. ఆయనతో మరో సినిమా చేయబోతున్నాను." అని చెప్పుకొచ్చాడు రామ్.