చిరంజీవి పాట కోసం లారెన్స్ కండీషన్.. ఏం తీసుకున్నాడో తెలుసా..?
on Apr 12, 2017

ఖైదీ నెం..150 సినిమాలో రత్తాలు సాంగుకు లారెన్స్ కొరియోగ్రాఫ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సాంగు కొరియోగ్రాఫ్ చేయాడానికి లారెన్స్ చిరంజీవికి ఓ కండీషన్ పెట్టాడంటా. లారెన్స్ ఏంటీ.. మెగాస్టార్ చిరంజీవికి కండీషన్ పెట్టడం ఏంటీ.. అనుకుంటున్నారా..? ఆ కండీషన్ ఏంటో వింటే మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. అసలు సంగతేంటంటే.. కాంచన, గంగ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన లారెన్స్ త్వరలో 'శివ లింగ' సినిమా ద్వారా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిలో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన చిరంజీవి 150వ సినిమా రత్తాలు సాంగు గురించి కూడా ప్రస్తావించారు. రత్తాలు సాంగు కోసం ఒక రోజు చిరంజీవిగారు ఫోన్ చేశారని.. ఏంట్రా బావున్నావా ఒక హెల్ప్ చేసి పెడతావా... నా సినిమాకు సాంగ్ కంపోజ్ చేయాలని చెప్పారని అన్నారు. అయితే దానికి ఓ కండీషన్ పెట్టా..పాట చేసినందుకు నాకేమీ డబ్బు వద్దు కానీ... వదినమ్మ చేసే దోశలు మాత్రం కావాలనీ చెప్పా అన్నారు. దాంతో ఆ పాట చేసినన్ని రోజులూ అన్నయ్యతో తో పాటు నాకు కూడా వదినమ్మ టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ పంపించేది. టిఫిన్ బాక్సులో ‘చిరు దోశలు', లంచ్ బాక్సులో చికెన్ ఉండేది అని చెప్పుకొచ్చారు. ఏదో సూపర్ స్టెప్స్ వేయించి ఏదో పేరు కొట్టేయాలని చేయలేదు....ఈ వయసులో ఆయనను సౌకర్యంగా.. వయసుకు తగ్గట్లే ఆయనతో స్టెప్స్ వేయించాను అన్నారు లారెన్స్. మొత్తానికి లారెన్స్ ఈరకంగా చిరంజీవి మీద అభిమానాన్ని మరోసారి చూపించాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



