రమ్యకృష్ణకు రాజమౌళి క్షమాపణలు...
on Apr 12, 2017
దర్శక ధీరుడు రాజమౌళి రమ్యకృష్ణకు క్షమాపణలు చెప్పారంట. అంత పెద్ద తప్పు రాజమోళి ఏం చేశాడబ్బా అనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే...రాజమౌళి తీసిన ‘బాహుబలి’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల్లో బాహుబలి-2 కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో అన్ని పాత్రలను రాజమౌళి చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దారు. అన్ని పాత్రలు మంచి పేరు సంపాదించుకున్నాయి. ముఖ్యంగా శివగామి గా నటించిన రమ్యకృష్ణ పాత్ర. రమ్యకృష్ణ ఈ పాత్రలో నటించలేదు.. జీవించలేదు. నిజం చెప్పాలంటే రమ్యకృష్ణ వల్లే ఆపాత్రకు అంత పేరొచ్చిందని చెప్పొచ్చు. అయితే ముందు ఈపాత్రలో మొదట రమ్యకృష్ణను అనుకోలేదని.. శ్రీదేవిని సంప్రదించారని.. శ్రీదేవి భారీగా రెమ్యునరేషన్ అడగడంతో వెనకడుగు వేశాడని గతంలో వార్తలు కూడా వచ్చాయి. వార్తలు కాదు అది నిజమే. అయితే ఇప్పుడు ఈ విషయంలో తన తప్పు అంగీకరించాడు రాజమౌళి. చెన్నైలో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడిన రాజమౌళి.. ‘‘శివగామి’ పాత్ర కోసం మొదట వేరేవారిని అనుకున్నా. రమ్యకృష్ణగారు అందుబాటులో ఉన్నా.. వేరే వారి కోసం ప్రయత్నించా. అందుకు సిగ్గుపడుతున్నా. ఈ విషయంలో ఆమెకు సభాముఖంగా క్షమాపణ చెబుతున్నా అని అన్నాడు. మొత్తానికి శ్రీదేవి ని తీసుకోకుండా.. రమ్యకృష్ణ ని తీసుకొని రాజమౌళి మంచిపని చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



