అమ్మా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరుజన్మలకి కూడా కావాలి!
on Jan 28, 2022
చిరంజీవి ఎంతటి మెగాస్టార్ అయిన ఒక అమ్మకు కొడుకే! వృత్తిపై ఎంతటి అంకితభావం ప్రదర్శిస్తారో, కుటుంబానికీ అంతటి ప్రాముఖ్యం ఇస్తారాయన. ఇక అమ్మానాన్నలపై ఆయన చూపే ప్రేమ, భక్తి భావాలు ఎలాంటివో ఆయన సన్నిహితులందరికీ తెలుసు. శనివారం, జనవరి 29 ఆయన మాతృమూర్తి అంజనాదేవి జన్మదినం. మామూలుగా అయితే ఆమె పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి నిర్వహించే మెగాస్టార్.. ఈసారి ఆ పని చేయలేకపోయారు. కారణం.. ఆయన కొవిడ్‌తో బాధపడుతుండటం. దీంతో ఆయన బాధ చెప్పరానిది.
Also read: సునీల్‌శెట్టి ఇంట్లో ఈ ఏడాది రెండు పెళ్లిళ్లు!
అలాగని ఆయన కామ్‌గా ఉండిపోలేదు. సోషల్ మీడియా ద్వారా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మతో తను, తన భార్య సురేఖ కలిసున్న ఒక ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన ఆయన, "అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు. క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా.. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ అభినందనలతో .... శంకరబాబు" అని ఆయన రాసుకొచ్చారు.
Also read: 'సారంగ దరియా' పాటకు మరింత అందం తీసుకొచ్చిన 'లయ'!
చివరలో 'చిరంజీవి' అని కాకుండా అమ్మ తనను ఏ పేరుతో పిలుస్తుందో ఆ పేరు 'శంకరబాబు' అని తన పేరును ప్రస్తావించడం గమనార్హం. ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్ అనే విషయం తెలిసిందే.
ఇక చిరంజీవి తండ్రి వెంకట్రావు 2007 డిసెంబర్‌లో మరణించారు. అప్పట్నుంచీ అమ్మ అంజనాదేవిని కంటికి రెప్పలా చూసుకుంటూ వస్తున్నారు మెగా బ్రదర్స్.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
