సాయి పల్లవికి నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ ని!
on Jan 29, 2022
నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకతవరంలో రూపొందిన సినిమా 'శ్యామ్ సింగ రాయ్'. డిసెంబర్ 24 న థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. ఇటీవల ఓటీటీలో విడుదలై రికార్డు వ్యూస్ తో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమాపై సెలబ్రిటీలు కూడా ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీనియర్ నటి మధుబాల కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తాను సాయి పల్లవికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ని అని చెప్పారు.
తాజాగా 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చూశానని చెప్పిన మధుబాల.. తాను రీసెంట్ టైంలో చూసిన అద్భుతమైన సినిమా ఇది అని కొనియాడారు. ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను సాయి పల్లవి బిగ్గెస్ట్ ఫ్యాన్ ని అని ఆ వీడియోలో తెలిపారు. అందంగా ఉంటుంది, రియలిస్టిక్ గా చేస్తుంది, మంచి డ్యాన్సర్ అంటూ ప్రశంసించారు. అలాగే నాని అద్భుతంగా నటించాడని, 'శ్యామ్ సింగ రాయ్' లవ్లీ మూవీ అంటూ మూవీ టీమ్ కి మధుబాల విషెస్ తెలిపారు.
మధుబాల తన ఫ్యాన్ అని చెబుతూ, తనపై ప్రశంసలు కురిపించడంపై సాయి పల్లవి సంతోషం వ్యక్తం చేశారు. మీ మాటలు ప్రేమతో కూడిన కౌగిలిలా ఉన్నాయంటూ, మధుబాలకు ధన్యవాదాలు తెలుపుతూ సాయి పల్లవి ట్వీట్ చేశారు.
Also Read