ఏపీ వరద బాధితులకు చిరు, మహేశ్, తారక్, చరణ్ చేయూత!
on Dec 1, 2021
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి వరదలకు అనేకమంది నిరాశ్రయులయ్యారు. మరెంతోమంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల ప్రజలకు కలిగిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. వరద బాధితులను ఆదుకొనేందుకు ఏపీ ప్రభుత్వానికి తమ వంతు ఆర్థిక చేయూతను ప్రకటించారు స్టార్ యాక్టర్స్. చిరంజీవి, మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ తలో రూ. 25 లక్షల ఆర్థిక సాయాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందిస్తున్నట్లు ప్రకటించారు.
చిరంజీవి, "ఆంధ్రప్రదేశ్‌లో వరదల విపత్తు బాధిత కుటుంబాలకు నా వంతు సాయంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల విరాళం ప్రకటిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
మహేశ్‌బాబు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా, "ఆంధ్రప్రదేశ్‌లో వినాశకరమైన వరదల దృష్ట్యా, నేను CMRFకి 25 లక్షలు అందించాలనుకుంటున్నాను. ఈ సంక్షోభ సమయంలో అందరూ ముందుకు వచ్చి ఏపీకి సహాయం చేయాలని అర్థిస్తున్నాను." అని రాసుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్, "ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల వల్ల ప్రభావితమైన ప్రజల కష్టాలను చూసి చలించి, వారు కోలుకోవడానికి ఒక చిన్న చర్యగా నేను 25 లక్షల రూపాయలను అందిస్తున్నాను." అని ప్రకటించారు.
రామ్‌చరణ్, "వరదల కారణంగా ఏపీలో ప్రజలు పడుతున్న కష్టాలను చూస్తుంటే గుండె బరువెక్కుతోంది. సహాయ కార్యక్రమాల్లో నా వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి 25 లక్షల ఒక చిన్న విరాళాన్ని అందిస్తున్నాను." అని ట్వీట్ చేశారు."

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
