Home

»

Latest News

ఏపీ ప్ర‌భుత్వానికి రాఘ‌వేంద్ర‌రావు బ‌హిరంగ లేఖ‌!

Dec 1, 2021 9:43PM

 

ఆన్‌లైన్‌లో టికెట్ అమ్మాల‌నీ, టికెట్ ధ‌ర‌ల‌ను పెంచ‌రాద‌నీ, 4 షోల క‌న్నా ఎక్కువ వేయ‌కూడ‌ద‌నీ, బెనిఫిట్ షోలు వేసుకోకూడ‌ద‌నీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు త‌ప్పుప‌ట్టారు. మౌన‌మునిలా ఉండే ఆయ‌న‌, ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు స‌రైనవి కావ‌ని తెలియ‌జేస్తూ త‌న ట్విట్ట‌ర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఒక సుదీర్ఘ నోట్‌లో పదునైన అస్త్రాలు ఎక్కుపెట్టారు.

ఇండ‌స్ట్రీలో 45 సంవ‌త్స‌రాలుగా ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా నా అభిప్రాయాలు అర్థం చేసుకోండి. మ‌నం ఎప్పుడూ మూలాల్ని మ‌ర్చిపోకూడ‌దు. నేను ఇవాళ ఈ పొజిష‌న్‌లో ఉండ‌టానికి కార‌ణం ముందుగా ప్రేక్ష‌కులు, థియేట‌ర్ల యాజ‌మాన్యం, డిస్ట్రిబ్యూట‌ర్స్‌, నా నిర్మాత‌లు. వీళ్లంద‌రూ బాగుంటేనే ఇండ‌స్ట్రీ బాగుంటుంది. ప్ర‌స్తుతం టికెట్లు, షోస్ నిర్ణ‌యంతో చాలామంది తీవ్ర న‌ష్టాల‌కు గుర‌వుతారు. అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also read:  ఏపీలో టిక్కెట్ రేట్ల స‌మ‌స్య వ‌ల్లే 'దృశ్యం 2'ను ఓటీటీకి ఇచ్చేశాం!

కామ‌న్ మ్యాన్‌కి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమా ఒక్క‌టేనీ, ఒక గొప్ప అద్భుత‌మైన క‌థ కానీ, స‌ర‌దా స‌ర‌దాగా చూసే సినిమా కానీ థియేట‌ర్ల‌లో అంటే పెద్ద స్క్రీన్ల‌లో DTS ATMOS, 3D చూసిని అనుభూతి టీవీలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉండ‌దనీ ఆయ‌న గ‌ట్టిగా వాదించారు. షోస్ త‌గ్గించ‌డం వ‌ల‌న కానీ, టికెట్ల ధ‌ర‌లు త‌గ్గించ‌డం వ‌ల‌న కానీ పైన చెప్పిన అంద‌రూ న‌ష్ట‌పోతారు. ఒక హిట్ సినిమా ఎక్కువ షోస్ వేసుకున్నా మొద‌టి వారం రేట్స్ పెంచుకోవ‌డం వ‌ల‌న‌, త‌ర్వాత కొన్ని మామూలు సినిమాలు వ‌చ్చినా థియేట‌ర్ల యాజ‌మాన్యం, వాళ్ల‌ని న‌మ్ముకున్న కొన్ని వేల‌మందికి 2, 3 నెల‌ల‌కి స‌రిప‌డా ఆదాయం. ఎందుకంటే 100 సినిమాల‌లో హిట్స్ 10 శాతం క‌న్నా ఎక్కువ ఉండ‌వు. 10 శాతం యావ‌రేజ్‌. ఇది అంద‌రికీ తెలిసిన స‌త్యం. అని చెప్పారు.

Also read:  ఏపీలో గ‌వర్న‌మెంట్ కంట్రోల్‌లో సినిమా.. టాలీవుడ్ పెద్ద‌లు ఇప్పుడేం చేస్తారు?

ఆన్‌లైన్ వ‌ల‌న దోపిడీ ఆగిపోతుంద‌న‌డం క‌రెక్ట్ కాదనీ, ప్రేక్ష‌కుడు ఒక మంచి సినిమా చూడాల‌నుకుంటే టికెట్ వెల 300 అయినా, 500 అయినా చూస్తాడనీ ఆయ‌న బ‌ల్ల‌గుద్ది చెప్పారు. ఒక రూపాయికే సినిమా చూపిస్తామ‌న్నా అత‌నికి న‌చ్చ‌ని సినిమా చూడ‌డు. పైగా ఆన్‌లైన్‌లో చాలామంది ఇన్‌ఫ్లుయెన్స్ వున్న‌వాళ్లు బ్లాక్ చేసుకుని, వాళ్ల శిష్యుల ద్వారా బ్లాక్‌లో అమ్మ‌వ‌చ్చు. అదే రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే థియేట‌ర్ల వ‌ల‌న గ‌వ‌ర్న‌మెంట్‌కి ఎక్కువ టాక్స్ వ‌స్తుంది. ఈ అంశాల‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌భుత్వం త‌గిన న్యాయం చేకూరుస్తుంద‌ని ఆశిస్తున్నాను. అని రాసుకొచ్చారు రాఘ‌వేంద్ర‌రావు. 

మ‌రి ఆయ‌న ఆవేద‌న‌ను ఏపీ ప్ర‌భుత్వం అర్థం చేసుకుంటుందా? త‌మ నిర్ణ‌యాల వ‌ల్ల ఇండ‌స్ట్రీకి ఎదుర‌వుతున్న క‌ష్టాల‌ను అర్థం చేసుకుని, త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటుందా?  నిర్బంధం కాని వినోద సాధ‌న‌మైన సినిమాపై త‌న క‌ర్ర‌పెత్త‌నాన్ని స‌డ‌లిస్తుందా?  లెట‌జ్ వెయిట్ అండ్ సీ. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com