శరత్ కుమార్ పై హీరో విశాల్ పోలీస్ కంప్లైంట్
on Mar 4, 2016
రాధిక భర్త, నటుడు శరత్ కుమార్ పై విశాల్ పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. వివరాల్లోకి వెళితే, నడిగర్ సంఘం ఎన్నికలు వివాదాస్పదంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో హీరో విశాల్ వర్గం గెలుపొందారు. ఎన్నికలు ముగిసినా, రెండు వర్గాల మధ్య పోరు ఆగలేదు. తాజాగా, గతంలో నడిగర్ అధ్యక్షుడిగా చేసిన శరత్ కుమార్, అవినీతికి పాల్పడ్డారంటూ కొత్త కార్యవర్గ సభ్యులు చెన్నై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
నడిగర్ సంఘం పద్దుల లెక్కలు తమకు అప్పజెప్పలేదని, దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా, పట్టించుకోలేదని విశాల్ వర్గం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో గత బుధవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో, శరత్ కుమార్ పై కంప్లైంట్ చేయాలని, సభ్యులంతా డిసైడ్ అయ్యారు. గత కార్యవర్గ సభ్యులైన శరత్ కుమార్, రాథారవి తో పాటు మిగిలిన వారు కూడా కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరో వైపు శరత్ కుమార్ మాత్రం, తాను లెక్కలన్నీ అప్పజెప్పానని, అయినా కానీ కుట్ర చేసి, తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నడిగర్ సంఘం గొడవలతో, కోలీవుడ్ వాతావరణం వేడెక్కింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
