సమంత 'ఊ అంటావా మావ' సాంగ్ పై కోర్టుకెళ్లిన పురుషుల సంఘం!
on Dec 13, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'లో సమంత స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 'ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ' అంటూ సాగే ఈ సాంగ్ ఇటీవల యూట్యూబ్ లో విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కుర్రకారుకి మత్తు ఎక్కించేలా ఉన్న ఈ సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ సాంగ్ పై పురుషుల సంఘం కేసు వేయడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: 'యశోద'లో ఉన్ని ముకుందన్.. అప్పుడు అనుష్క, ఇప్పుడు సమంత!
'ఊ అంటావా మావ' సాంగ్ పై ఆంధ్రప్రదేశ్ లోని పురుషుల సంఘం కేసుపెట్టింది. సాంగ్ లో మగాడి బుద్ధి వంకర అంటూ, పురుషులను కామాంధులుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ పురుషుల సంఘం కోర్టుని ఆశ్రయించింది. ఫిర్యాదులో సమంత పేరు కూడా పేర్కొన్నట్లు తెలుస్తోంది. పురుషులపై తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉన్న ఈ పాటని వెంటనే నిషేధించాలని పురుషుల సంఘం డిమాండ్ చేస్తోంది. మరి దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: 'అఖండ' ఇచ్చిన ఊపుని 'పుష్ప' కంటిన్యూ చేస్తుంది
సమంత చిందేసిన మొదటి స్పెషల్ సాంగ్ పైనే కేసు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఈ సాంగ్ పాడింది, చిందేసింది మహిళలే అయినప్పటికీ.. ఈ సాంగ్ రాసింది, కంపోజ్ చేసింది పురుషులే. మరి ఈ వివాదంపై లిరిసిస్ట్ చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



