కరోనా దెబ్బ: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వాయిదా
on Mar 20, 2020

షెడ్యూల్ ప్రకారం మే నెలలో జరగాల్సిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను కరోనా వైరస్ భయంతో నిలిపివేశారు. యూరప్‌లో కరోనా వైరస్ వ్యాప్తి అనూహ్యంగా ఉండటంతో ఇన్‌ఫెక్షన్ భయంతో ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చలన చిత్రోత్సవం 2020 ఎడిషన్‌ను మే నెలలో నిర్వహించడం లేదని అధికారికంగా ప్రకటించారు. కాన్స్ ఫెస్టివల్ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో, "ఫ్రెంచ్‌తో పాటు అంతర్జాతీయ పరిస్థితిని, ఆరోగ్య సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని మే 12 నుంచి 23 వరకు ప్లాన్ చేసిన ఫెస్టివల్ డీ కాన్స్‌ను నిర్వహించడం లేదు" అని పోస్ట్ చేశారు.
అయితే 2020 కాన్స్ ఫెస్టివల్‌ను వాయిదా మాత్రమే వేశామనీ, మే తర్వాత ఏదో ఒకరోజు ఫెస్టివల్ జరుగుతుందనే ఆశాభావాన్ని నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలాఖరు, జూలై ప్రారంభం నాటికి ఈ ఫెస్టివల్‌ను వాయిదా వేశామని, దాన్ని నిర్వహించడానికి పలు అవకాశాల్ని పరిశీలిస్తున్నామనీ వారు తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. అక్కడ ఇప్పటివరకూ 11 వేల మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా, 372 మంది చనిపోయారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



