'బంపర్ ఆఫర్' వచ్చిన పన్నెండేళ్లకు సీక్వెల్!
on Mar 6, 2021
ఓ చిత్రం విజయం సాధిస్తే దానికి సీక్వెల్ చేయటం ఓ పద్ధతి. అదే చిత్రం పేరును కొనసాగిస్తూ కొత్త కథను తెరకెక్కించడం మరో పద్ధతి. ఇప్పుడీ రెండో పద్దతిలోనే ఓ చిత్రం ఈరోజు పురుడు పోసుకుంది. సాయిరాం శంకర్ హీరోగా గతంలో రూపొందిన 'బంపర్ ఆఫర్' చిత్రం, సాధించిన విజయం ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఇప్పుడు ఆయనే హీరోగా అదే పేరును కొనసాగిస్తూ 'బంపర్ ఆఫర్ 2' పేరుతో ఓ చిత్రం నిర్మితం కానుంది.
సాయిరాం శంకర్ హీరోగా సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్ సంయుక్త నిర్మాణంలో 'బంపర్ ఆఫర్ 2' చిత్రాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు. ఒరిజినల్ వచ్చిన పన్నెండు సంవత్సరాల తర్వాత రెండవ భాగం చేస్తుండటం గమనార్హం. అయితే ఇది సీక్వెల్ కాదు. రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా దీన్ని రూపొందించబోతున్నారు. 'బంపర్ ఆఫర్' చిత్రానికి దర్శకత్వం వహించిన జయ రవీంద్ర ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి అశోక స్క్రిప్ట్ రచన చేశారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఉగాది సందర్భంగా ఏప్రిల్ నెలలో ప్రారంభం అవుతుంది. చిత్రం లోని హీరోయిన్స్, ఇతర తారాగణం,సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సురేష్ యల్లంరాజు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చుతుండగా, పప్పు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు.
సాంకేతిక బృందం:
దర్శకత్వం: జయరవీంద్ర, నిర్మాతలు: సురేష్ యల్లంరాజు, సాయి రామ్ శంకర్, బ్యానర్లు: సురేష్ విజయ ప్రొడక్షన్స్, సినిమాస్ దుకాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్ రాజు చామర్తి, సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: పప్పు, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, కథ: అశోక, కళ: వర్మ, పీఆర్వో: లక్ష్మీ వేణుగోపాల్.
Also Read