ఆరో రోజు మరింతగా తగ్గిన 'బ్రో' కలెక్షన్స్!
on Aug 3, 2023
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన 'బ్రో' చిత్రం.. వీక్ డేస్ లో కలెక్షన్ల పరంగా నిరాశపరుస్తోంది. తొలి వారాంతంలో మంచి వసూళ్ళు రాబట్టిన ఈ మెగా కాంపౌండ్ మల్టిస్టారర్.. సోమవారం నుంచి ఆశించిన రీతిలో బాక్సాఫీస్ ముంగిట పెర్ఫార్మెన్స్ చేయలేకపోతోంది. సోమవారం కంటే మంగళవారం వసూళ్ళు తగ్గగా.. ఆరో రోజైన బుధవారం మరింత తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. దీంతో.. రూ. 97 కోట్ల షేర్ టార్గెట్ తో బరిలోకి దిగిన 'బ్రో'.. ఇక నష్టాలు చూడక తప్పని పరిస్థితి ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 30.01 కోట్ల షేర్ రాబట్టిన 'బ్రో' మూవీ.. రెండో రోజు రూ. 12. 32 కోట్ల షేర్, మూడో రోజు రూ. 12. 93 కోట్ల షేర్ ఆర్జించింది. ఇక నాలుగో రోజైన సోమవారం రూ. 2.96 కోట్ల షేర్, ఐదో రోజైన మంగళవారం రూ. 2. 20 కోట్ల షేర్, ఆరో రోజైన బుధవారం రూ. 1.84 కోట్ల షేర్ చూసింది. ఈ ఆరు రోజులకి గానూ ఓవరాల్ గా రూ. 62. 26 కోట్ల షేర్ (రూ. 104. 20 కోట్ల గ్రాస్) రాబట్టింది 'బ్రో'. మరి.. వీక్ డేస్ లో అనుకున్నంతగా రాణించలేకపోయిన 'బ్రో'.. శని, ఆది వారాల్లోనైనా పుంజుకుంటుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



