ప్లే బ్యాక్ సింగర్ ధనుంజయ్ కి డాక్టరేట్
on Aug 3, 2023

ప్లే బ్యాక్ సింగింగ్ లో దశాబ్దానికి పైగా ఉన్న టాలెంటెడ్ సింగర్స్ లో ధనుంజయ్ సీపాన ఒకరు. ఇప్పుడు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ పరిశోధకులు, సింగర్ ధనుంజయ్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. "నేను సంగీతంలో పిహెచ్ డి పూర్తి చేసాను.. డాక్టరేట్ డిగ్రీని అందుకున్నాను . ఆ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నా ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద రెడ్డి గారికి, నా నిరంతర అధ్యయనంలో సలహాలు, సూచనలు ఇస్తూ నన్ను ముందుకు నడిపించిన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, నా గైడ్, ప్రొఫెసర్ కే.సరస్వతి విద్యార్థి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను." అంటూ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టుకున్నారు.
సరస్వతి విద్యార్థి పర్యవేక్షణలో 1960-2020 మధ్యకాలంలో వచ్చిన సినీ సంగీతంలో "వీణ, వయొలిన్, వేణువుల వినియోగం - అధ్యయనం" అనే అంశంపై జరిపిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ ని ఆయన అందుకున్నారు ధనుంజయ్. "వేయి అబద్దాలు" మూవీతో అరంగేట్రం చేసిన ధనుంజయ్ తర్వాత ఒక రొమాంటిక్ క్రైమ్ కథ , ప్రేమ కావాలి, గుండెజారి గల్లంతయ్యిందే, లౌక్యం , సరైనోడు, గోపాల గోపాల, సోగ్గాడే చిన్నినాయనా, భీష్మ, మాస్ట్రో, కాటమరాయుడు వంటి మూవీస్ కి ప్లేబ్యాక్ సింగర్ గా వర్క్ చేశారు. శ్రీకాకుళంలో పుట్టిన ధనుంజయ్ ఉత్తమ గాయకుడిగా గామా అవార్డు ని కూడా అందుకున్నారు. ధనుంజయ్ సీపాన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి గాత్ర సంగీతంలో డిగ్రీ పట్టా పొందారు. హైదరాబాద్‌లో ఎన్నో స్టేజ్ షోలు, ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



