బ్రహ్మోత్సవం కు ముందే టచ్ లోకి వస్తున్న మహేష్...!
on May 14, 2016

శ్రీమంతుడు తర్వాతి నుంచి సూపర్ స్టార్ మహేష్ లో మార్పు బాగా వచ్చింది. చాలా సిగ్గుతో ఉండే సూపర్ స్టార్, ఇప్పుడు ఓపెన్ గా, కూల్ గా ఉంటున్నాడు. ఒకప్పుడు ఇంటర్వ్యూలంటే అంటీ ముట్టనట్టుండే మహేష్, ఈ మధ్య సినిమా ప్రమోషన్ బాధ్యతల్ని తన భుజాన వేసుకుంటున్నారు. బహుశా తనే నిర్మాతగా మారినందువల్ల కావచ్చు. కారణమేదైతేనేం, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన్ను మరిన్ని సార్లు బుల్లి తెరపై కూడా చూసుకోవచ్చని ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు. శ్రీమంతుడు తర్వాత, పబ్లిసిటీకి మహేష్ ఇచ్చే ఇంపార్టెన్స్ పెరిగింది. అందుకే ఆ సినిమాకు హెవీ ప్రమోషన్స్ చేసిన మహేష్, బ్రహ్మోత్సవానికి కూడా అదే రేంజ్ లో ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. అందుకే టీవీషోల్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా మొగ్గు చూపుతున్నాడు. యాంకర్ ప్రదీప్ నిర్వహించే ఒక టాక్ షో కు సంబంధించి మూడో సీజన్ ను మహేష్ తోనే మొదలవుతోంది. సినిమా రిలీజ్ టైం లో తప్ప, పెద్దగా కనిపించని మహేష్ కోసం, ఆయన ఇంటర్వ్యూ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా ఎనర్జీతో సాగే ఈ టాక్ షో ను సైలెంట్ గా ఉండే మహేష్ ఎలా డీల్ చేస్తాడో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



