Home

»

Latest News

హీరోయిన్ బట్టలు విప్పించాడు..!

May 14, 2016 10:02AM

సాధారణంగా గ్లామర్ సీన్స్ చేసేప్పుడు హీరోయిన్స్ సెట్లో ఎక్కువమంది ఉండకూడదని కండిషన్లు పెడుతుంటారు. స్క్రీన్ మీద కోట్ల మంది చూసినా ఫర్లేదు గానీ, సీన్ చేసే సమయంలో మాత్రం సిగ్గు ఎక్కువగానే ఉంటుందీ భామలకు. అయితే ఒక మళయాళీ హీరోయిన్ తాజాగా, తన చేత అన్యాయంగా బట్టలు విప్పించారని, డైరెక్టర్ కావాలనే ఇలా చేయించాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే, కేరళ లోని తొడుపుళలో దైవం సాక్షి అనే సినిమా షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణ జరుగుతున్న సమయంలో, దర్శకుడు స్నేహజిత్ సినిమాలో లేని సీన్ ను ఉందని చెప్పి తనచేత బట్టలు విప్పించాడంటూ తొడపుళ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది సినిమా హీరోయిన్. సినిమా స్టార్ట్ చేయడానికి ముందు తన పాత్ర గురించి, స్క్రిప్ట్ గురించి పూర్తిగా చదివానని, అప్పుడు ఇలాంటి సీన్ లేకపోయినా డైరెక్టర్ దురుద్దేశంతో ఇలా చేయించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తొడపుళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com