బ్రహ్మోత్సవం నుంచి తప్పుకున్న మణిశర్మ..!
on May 12, 2016

మెలోడీ బ్రహ్మ అని మణిశర్మకు పేరు. కానీ ప్రస్తుతం ఆయన్ను మెలోడీల కోసం కాక, బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో కూడా మణిశర్మకు తిరుగులేదు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ఇంద్ర, ఠాగూర్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, స్టాలిన్ లాంటి సినిమాల బ్యాగ్రౌండ్ స్కోర్లు నేటికీ సెన్సేషనల్ గానే అనిపిస్తాయి. అందుకే ఇప్పుడు చాలామంది డైరెక్టర్లు మణి బ్యాగ్రౌండ్ చేయించుకుంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, టెంపర్ సినిమాలకు బ్యాగ్రౌండ్ మణిశర్మే అందించారు. త్వరలో రాబోతున్న తన బ్రహ్మోత్సవం సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ మణిశర్మతో చేయించాలనుకున్నాడు మహేష్. ఆల్ మోస్ట్ ఫిక్సైన మణిశర్మ ఎందుకో చివరి నిముషంలో తప్పుకున్నాడు. దీంతో సినిమా నిర్మాతలు తమ ముందు సినిమా ' ఊపిరి 'కి మ్యూజిక్ చేసిన గోపీ సుందర్ తో హడావిడిగా ఆర్ ఆర్ చేయిస్తున్నారట. మే 20 న రిలీజ్ డేట్ ప్రకటించేయడంతో మిక్కీతో పాటు గోపీ కూడా శ్రమిస్తూ వీలైనంత మంచి అవుట్ పుట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



