ప్రియాంక చోప్రా అసలు రూపం చూశారా..?
on May 12, 2016

క్వాంటికో టీవీ సీరీస్, సూపర్ స్టార్ డ్వేన్ జాన్సన్ తో బే వాచ్ సినిమాలతో ప్రియాంక చోప్రా హాలీవుడ్ కెరీర్ మంచి స్పీడ్ మీదుంది. అయితే హాలీవుడ్ చేరుకోవడానికంటే ముందు, బాలీవుడ్ లో ఈ అమ్మడు చాలా తిప్పలే పడింది. అవకాశాలు లేక, వచ్చిన అవకాశాలు నిలబెట్టుకోలేక కెరీర్ మొదట్లో కష్టపడింది. అయితే వాటన్నింటినీ దాటుకుని ఇప్పుడున్న స్థాయికి చేరకోవడం మామూలు విషయం కాదు. 2000 లో మిస్ వరల్డ్ గా ఎంపికైనప్పటి నుంచి రీసెంట్ గా పద్మశ్రీ తీసుకోవడం వరకూ, ప్రియాంక చాలా స్టేజ్ లు దాటింది. చివరికి ప్రపంచమంతా గమనిస్తున్న హాలీవుడ్ సినిమాల్లో స్థానం సంపాదించుకుంది. సినిమాల్లోకి రాకముందు ప్రియాంక చేయించుకున్న ఫోటో షూట్ చూస్తే, అసలు ప్రియాంకేనా అని డౌట్ రాక మానదు. ఇప్పుడున్న ప్రియాంక చోప్రాకు, అప్పటి ప్రియాంకకు అసలు సంబంధమే లేదు. ఫోటో చూస్తే ఆ విషయం మీకే అర్ధమవుతుంది. తన ముఖం బాగాలేదని ప్రొడ్యూసర్లు సినిమాలను రిజెక్ట్ చేస్తుంటే, అనేక సర్జరీలతో ఇప్పుడున్న ఆకృతికి ముఖాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా తన బోటోక్స్ ఇంజక్షన్లతో పెదాల్ని పెద్దగా చేయించుకుందని బాలీవుడ్ జనాలంటుంటారు. ఏదేమైతేనేం, కెరీర్లో మాత్రం సక్సెస్ సాధించేసింది. అయినా.. పాత ప్రియాంకే బాగున్నట్టుంది కదా...!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



