మహేష్ బాబు లెక్క దారుణంగా తప్పింది..!
on May 20, 2016

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే ఒక అభిప్రాయం జనాల్లో ఉంటుంది. అయితే అదే లెక్కతో బ్రహ్మోత్సవం హాళ్లకు వెళితే దెబ్బయిపోవడం కన్ఫామ్. స్టోరీ పరంగా ఎప్పుడూ చాలా జాగ్రత్తలు తీసుకునే మహేష్, బ్రహ్మోత్సవం సినిమాను ఎంపిక చేసుకుని దారుణంగా ఫెయిలయ్యాడు. తనే స్టోరీ విన్నాడో, లేక ఈసారి నమ్రతకు డిసిషన్ వదిలేశాడో గానీ, బాబు దెబ్బైపోయాడు. తన కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్ల లిస్టులో ఉన్న నాని, నిజం సినిమాల్ని దాటేసి బ్రహ్మోత్సవం ఫస్ట్ ప్లేస్ కు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కథ ఎంచుకోవడంలో మహేష్ ఇంతలా ఎందుకు ఫెయిలయ్యాడనేది మాత్రం ఎవరికీ అర్ధం కాని విషయం. తమ హీరో ఇలాంటి సినిమా చేశాడని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో వన్ నేనొక్కడినే, ఖలేజా లాంటి సినిమాలు కమర్షియల్ గా ఫెయిలైనా, ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. కానీ బ్రహ్మోత్సవం మాత్రం, థియేటర్లో బొమ్మ చూపించేస్తోందట. బయటికి వచ్చే టైంలో ఫ్యాన్స్ ఎందుకు నవ్వుతున్నారో వాళ్లకు కూడా తెలియని పొజీషన్. సినిమా కనీసం యాభై కోట్లైనా దాటడం గగనమే అనేది ప్రస్తుతం ఉన్న టాక్..
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



