బ్రహ్మోత్సవాన్ని సినిమా అంటారా..?
on May 20, 2016
సీరియల్ ను టీవీల్లో చూడాలి. సినిమాల్ని హాళ్లలో చూడాలి. సీరియల్ ను సినిమాలా తీసేసి జనాల మీదకు రుద్దితే ఫలితం బ్రహ్మోత్సవంలా ఉంటుంది. హాళ్లకు జనం వచ్చేది ఎంటర్ టైన్మెంట్ కోసమే తప్ప క్లాస్ పీకించుకోవడానికి కాదు. థియేటర్లలో జనాన్ని కూర్చోబెట్టి క్లాసులు పీకడం ఏంటి మాష్టారూ..! చూడటానికి, వినడానికి కూడా ఇది చాలా ఎబ్బెట్టుగా ఉంది. సా...గదీసే సీరియళ్లు టీవీల్లో రోజుల తరబడి నడిపిస్తారు. అలాంటి స్టోరీతో సినిమా తీయడమా..ఒకవేళ తీస్తే ఫలితం ఇదిగో ఇలాగే, బ్రహ్మోత్సవంలా ఉంటుంది. థియేటర్ బయట ఖర్చీప్ లు, జండూబామ్ లు అమ్ముకోవాల్సిన పరిస్థితి. హాల్లో కూర్చోబెట్టి, జనం ఓపికకు టెస్ట్ పెట్టడమంటే ఏంటో పూర్తిగా చూపించేసింది బ్రహ్మోత్సవం. ఏకంగా మహేష్ ఫ్యాన్సే ఏంట్రాబాబూ ఈ సినిమా అంటూ, తలపోటు, తలపైన గుడ్డతో బయటికి వచ్చే పొజీషన్ హాళ్ల దగ్గర కనిపిస్తోంది. అయినా ఖర్చుపెట్టేసి సీరియల్ ను సినిమాగా తీసేస్తే హిట్టవుద్దా..పోనీ తీశారే అనుకుందాం..కనీసం సినిమాలో కాస్త విషయం ఉండాలి కదా. జీవితంలో ఎన్నో ఏడుపులుండే జనం, ఏదో కాస్త నవ్వుకుందామని, ఎంటర్ టైన్ అవుదామని హాళ్లకు వస్తారు. ఇక్కడ కూడా ఈ ఏడుపులేంట్రా నాయనా అంటూ ఇప్పుడు గోల పెట్టేస్తున్నారు హాళ్లకు వెళ్లినోళ్లు. మొత్తమ్మీద ఈ ఏడాది భారీ డిజాస్టర్ల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కోసం పోటీ పడుతోంది పివిపి బ్రహ్మోత్సవం..