ఊహించని ట్విస్ట్.. 'బ్రహ్మాస్త్ర' ఈవెంట్ క్యాన్సిల్
on Sep 2, 2022

బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని సౌత్ లో దర్శకధీరుడు రాజమౌళి సమర్పిస్తుండటం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు(సెప్టెంబర్ 2) భారీస్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా చివరి నిమిషంలో ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయింది.
'బ్రహ్మాస్త్ర' ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ అని ప్రకటన రాగానే ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి కలిగింది. చివరిసారిగా జులై 29న జరిగిన 'బింబిసార' ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ దర్శనమిచ్చాడు. ఇంచుమించు నెల వ్యవధిలోనే మరోసారి తారక్ ని చూసే అవకాశమొస్తుందని ఫ్యాన్స్ ఎంతో సంబరపడ్డారు. అయితే ఇప్పుడు వారికి ఊహించని షాక్ తగిలింది. అనుకోని కారణాల వల్ల చివరి నిమిషంలో ఈ కార్యక్రమం రద్దయింది. అయితే తారక్ తో కలిసి మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రల్లో నటించారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



