మళ్లీ ప్రేమలో పడ్డ బోయపాటి శ్రీను..!
on May 10, 2016

బోయపాటి శ్రీను అన్న పేరు వినగానే నరకడం, చంపడం, విలన్లు నేల మీద పడి మళ్లీ బౌన్స్ అవడం లాంటివే గుర్తొస్తాయి. బోయపాటి అంటే ప్యాక్షన్, వయిలెంట్ సినిమాలే తీస్తాడనే పేరు పడిపోయింది. కానీ తన మొదటి సినిమా భద్రను లవ్ స్టోరీగానే తెరకెక్కించాడు బోయపాటి. కానీ ఆ తర్వాత బాలయ్య, ఎన్టీఆర్, వెంకటేష్ లాంటి మాస్ హీరోలతో సినిమాలు పడటంతో, లవ్ అండ్ రొమాంటిక్ జానర్ తో ఆయనకు పెద్ద అవసరం రాలేదు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ తో తీసిన సరైనోడు కూడా మాస్ ను టార్గెట్ చేసిందే.
ఆ సినిమా సూపర్ హిట్టవడంతో మంచి ఊపు మీదున్న బోయపాటి, ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా పై దృష్టి పెట్టాడు. చాలా కాలం పాటు తను టచ్ చేయని లవ్ జానర్ ను ఈ కుర్ర హీరోతో తెరకెక్కించే ప్లాన్ వేస్తున్నాడట బోయపాటి. కమర్షియల్ హంగులతో పాటు, ప్రేమకథ ప్రధానంగా సాగే కథను సాయి కోసం తయారుచేశాడని సమాచారం. సింగిల్ గా జనాన్ని థియేటర్లకు రప్పించే స్టార్ డం సాయి శ్రీనివాస్ కు లేదు. అందుకే సినిమాలో ఫ్యామస్ సౌత్ ఇండియన్ స్టార్ ఎవరినైనా పెట్టి, మూవీకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడని మూవీ వర్గాలంటున్నాయి. స్పీడున్నోడితో, సరైనోడి డైరెక్టర్ టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



