మా ఇంట్లో దెయ్యం ఉందంటున్న అల్లరి నరేష్..!
on May 10, 2016
ఒకప్పుడు వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అల్లరి నరేష్, ఈ మధ్య కాలంలో బాగా సైలెంట్ అయిపోయాడు. శరవేగంగా యాభై సినిమాల మార్కును దాటేసినా, ఆ తర్వాత మాత్రం చాలా స్లో అయింది అల్లరి నరేష్ కెరీర్. చివరిగా మామ మంచు అల్లుడు కంచు సినిమాతో ఫ్లాప్ ను చూసిన అల్లరోడికి ఇప్పుడు సక్సెస్ అత్యవసరం. అందుకే చాలా మందికి హిట్టిచ్చిన హర్రర్ కామెడీపై పడ్డాడు. ఇన్నాళ్లూ హర్రర్ కామెడీని టచ్ చేయని నరేష్ లేటెస్ట్ గా జి.నాగేశ్వరరెడ్డి డైరెక్షన్లో ఆ జానర్లో చేయడానికి కమిట్ అయ్యాడని సమాచారం. అత్తారింటికి దారేది నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమాకు మా ఇంట్లో ఉంది దయ్యం, నాకెందుకు భయం అంటూ చాలా విచిత్రమైన టైటిల్ పెట్టడం విశేషం. ఫ్లాపుల్లో ఉన్న చాలా మందికి హర్రర్ కామెడీ జానర్ లైఫ్ ఇచ్చింది. ప్రేమకథాచిత్రమ్, రాజు గారి గది, లారెన్స్ ముని సీరీస్ సినిమాలన్నీ ఇలాంటి జానర్ లో వచ్చినవే. పైపెచ్చు నాగేశ్వరరెడ్డి లాంటి కామెడీ సినిమాల ఎక్స్ పర్ట్ ను తీసుకోవడం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా చెప్పాలి. చాలా కాలంగా అల్లరి నరేష్ కు అవసరమైన హిట్ ను, ఈ దయ్యం సినిమా తీరుస్తుందేమో చూడాలి.