బాండ్ భామలుగా దీపిక, ప్రియాంక..?
on May 11, 2016

బాలీవుడ్ జెండాను హాలీవుడ్ లో రెపరెపలాడిస్తున్నారు దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా. హాలీవుడ్ సూపర్ స్టార్ విన్ డీజిల్ సినిమాలో దీపిక బిజీగా ఉంటే, క్వాంటికో, బేవాచ్ ప్రాజెక్ట్స్ తో ప్రియాంక సందడి చేస్తోంది. తాజాగా వీళ్లిద్దరిలో హీరోయిన్స్ ప్రతిష్టాత్మకంగా భావించే బాండ్ భామ గా ఎంపికవుతారని వార్తలు వస్తున్నాయి. గతేడాది వచ్చిన స్పెక్టర్ తో పాత బాండ్ డేనియల్ క్రెయిగ్ డీల్ ముగిసింది. తర్వాతి జేమ్స్ బాండ్ కోసం వెతుకుతున్న నిర్మాణ సంస్థ, హీరోయిన్స్ ను కూడా బాలీవుడ్ నుంచి తీసుకునే ఆలోచనలో ఉందట. జేమ్స్ బాండ్ ప్రియురాలిగా ఉండే ఈ పాత్రలు తమను వరిస్తే చాలని హాలీవుడ్ భామలందరూ ఎదురుచూస్తుంటారు. అలాంటి ఈ సినిమాలో ఛాన్స్ దక్కితే, మన బాలీవుడ్ భామల పంట పండినట్లే. హాలీవుడ్ లో పిఆర్ ను బాగా డెవలప్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మలిద్దరూ, నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతూః అవకాశాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. జేమ్స్ బాండ్ నిర్మాణ సంస్థ వీళ్లిద్దరిలో ఒకరిని తమ సినిమాకు తీసుకునే ఆలోచనలో ఉందని హాలీవుడ్ జనాల టాక్. మరి వీళ్లని ఆ అదృష్టం వరిస్తుందో లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



