వార్ 2 కి యానిమల్ కి లింక్!.. ఎన్టీఆర్ చెప్పిన సర్పైజ్ అదేనా!
on Aug 12, 2025

ఈ నెల 14 న ఎన్టీఆర్(Ntr),హృతిక్ రోషన్(Hrithik Roshan)ల ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్ 'వార్ 2'(War 2)థియేటర్స్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఐదు దశాబ్దాలపై నుంచి ఎన్నో హిట్ చిత్రాలు నిర్మిస్తు వస్తున్న 'యష్ రాజ్ ఫిల్మ్స్'(Yash Raj Films)వార్ 2 ని రూపొందించింది. కథని భారీగా సమకూర్చడంలోను, అందుకు తగ్గ ఆర్టిస్టులని ఎంచుకోవడంలో యష్ రాజ్ సంస్థ ముందు వరుసలో ఉంటుంది. వార్ 2 కథకి ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా సూటవుతాడని భావించిన యష్ రాజ్ సంస్థ, ఎన్టీఆర్ కోసం చాలా కాలం పాటు వెయిట్ చేసి మరి వార్ 2 ని నిర్మించింది. దీన్ని బట్టి నటీనటుల విషయంలో యష్ రాజ్ కమిట్ మెంట్ ని అర్ధం చేసుకోవచ్చు.
ఇక వార్ 2 లో స్టార్ యాక్టర్ 'బాబీడియోల్'(Bobby Deol)కూడా ఒక కీలక క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని, క్లైమాక్స్ కి ముందు సదరు క్యారక్టర్ ఎంటరై ప్రేక్షకులకి గూస్ బంప్స్ తెప్పిస్తుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వార్ 2 పక్కా యాక్షన్ చిత్రం. ప్రచార చిత్రాల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోరాట సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయని అర్ధమవుతుంది. బాబీ డియోల్ కూడా యాక్షన్ సన్నివేశాల్లో ఒక రేంజ్ లో చేస్తాడు. యానిమల్(Animal),డాకు మహారాజ్(Daku Maharaj)హరిహర వీరమల్లు(Harihara Veeramallu)వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ.
ఈ నేపథ్యంలో వార్ 2 లో బాబీడియోల్ ఉండటం నిజమైతే మూవీకి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ఎన్టీఆర్ తో పాటు మేకర్స్ పలు ఇంటర్వ్యూ లో మాట్లాడుతు మూవీలో చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని బట్టి బాబీ డియోల్ ఉండే అవకాశం ఉందనే మాటలు కూడా వినపడుతున్నాయి.కియారా అద్వానీ(Kiara Advani)అనిల్ కపూర్, అశుతోష్ రానా కీలక పాత్రలు పోషిస్తున్న వార్ 2 కి అయాన్ ముఖర్జీ(Ayan Mukerji)దర్శకుడు. 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్(War)కి సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కింది.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



