రామ్‌గోపాల్‌వర్మ సెల్ ఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఎందుకంటే!
on Aug 12, 2025
గతంలో తన సినిమాల ద్వారా సంచలనం సృష్టించిన రామ్‌గోపాల్‌వర్మ.. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో తన పోస్టుల ద్వారా మరోసారి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఫిబ్రవరి 7న విచారణకు హాజరయ్యారు వర్మ. ఇప్పుడు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేయడంతో ఆగస్ట్ 12న ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణ నిమిత్తం హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మ సెల్ ఫోన్‌ను సీజ్ చేశారు పోలీసులు. గత విచారణ సమయంలో సెల్ ఫోన్ తీసుకురాని వర్మ.. ఈసారి ఫోన్‌తో వచ్చారు. దీంతో ఫోన్‌ను సీజ్ చేసి అందులో లభించే ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టిన వర్మ.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేశారని, వ్యూహం సినిమా ప్రమోషన్‌లో నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి కించ పరిచారని కేసులు పెట్టారు. అంతేకాదు, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రాంగోపాల్‌వర్మకి రెండు కోట్లు చెల్లించింది వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా వర్మను విచారిస్తున్నారు పోలీసులు. అలాగే ఫోటోల మార్ఫింగ్ వ్యవహారంలో వెనుక ఎవరు ఉన్నారనే విషయాలను కూడా ఆరా తీస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



