ప్రభాస్ పుట్టినరోజుకి 'బిల్లా' స్పెషల్ షోలు!
on Aug 30, 2022

ఈమధ్య స్టార్ హీరోల పుట్టినరోజుకి సూపర్ హిట్ సినిమాల స్పెషల్ షోల ట్రెండ్ నడుస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజుకి 'పోకిరి', చిరంజీవి పుట్టినరోజుకి 'ఘరానా మొగుడు' ప్రత్యేక షోలు ప్రదర్శించారు. వీటికి అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) కానుకగా 'జల్సా', 'తమ్ముడు' సినిమాల స్పెషల్ షోల సందడికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్. ఆయన పుట్టినరోజుకి 'బిల్లా' స్పెషల్ షోలు వేయబోతున్నారు.
ప్రభాస్, అనుష్క జంటగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'బిల్లా'. ఏప్రిల్ 3, 2009న విడుదలైన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఇప్పటిదాకా మెహర్ రమేష్ డైరెక్షన్ లో నాలుగు తెలుగు సినిమాలు రాగా, అందులో ప్రేక్షకులను మెప్పించిన సినిమా 'బిల్లా'నే కావడం విశేషం. ఇందులో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ కి, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ చిత్రం ఫ్యాన్స్ ని 4k లో అలరించడానికి సిద్ధమవుతోంది.

ప్రభాస్ పుట్టినరోజు(అక్టోబర్ 23) కానుకగా 'బిల్లా' స్పెషల్ లను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలోని మిగతా రాష్ట్రాలలోనూ, ఓవర్సీస్ లోనూ ప్రదర్శించబోతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం 'బుజ్జిగాడు', 'ఛత్రపతి' వంటి సినిమాలను ప్రదర్శిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



