'NBK 107'.. బాలయ్య న్యూ లుక్ అదిరింది!
on Aug 30, 2022

నటసింహం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. షూటింగ్ లొకేషన్ నుంచి విడుదలవుతున్న ఒక్కో ఫోటో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఇటీవల కాలంలో బోయపాటి శ్రీను తర్వాత ఆ రేంజ్ లో బాలయ్య లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్న డైరెక్టర్ గోపీచందేనంటూ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో ఫోటోని షేర్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు గోపీచంద్.
బాలకృష్ణ మొదటి సినిమా 'తాతమ్మ కల' విడుదలై 48 ఏళ్లయింది. ఈ సందర్భంగా బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు డైరెక్టర్ గోపీచంద్. అది 'NBK 107' సెట్స్ లో బాలయ్య, శృతి హాసన్ తో కలిసి మలినేని తీసుకున్న సెల్ఫీ కావడం విశేషం. అందులో బాలయ్య లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీసకట్టు, కళ్ళద్దాలతో ఆయన స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఫోటోని బట్టి చూస్తే అది షూట్ అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



