బిగ్ బాస్ విన్నర్‌కు నాగ్ బంపర్ ఆఫర్!
on Mar 9, 2021
బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజీత్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సాఫ్ట్ కుర్రాడు ఇటీవల బిగ్ బాస్ సీజన్ 4తో మరింతగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. మొదట మోనాల్, ఆ తరువాత హారికతో హౌస్‌లో లవ్ స్టోరీ కోసం పులిహోర కలిపిన అభిజీత్, హౌస్ నుంచి బయటికి వచ్చాక హారికని కూడా పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్లతో రీయూనియన్ లో భాగంగా 'బిగ్ బాస్ ఉత్సవం' పేరుతో ఓ కార్యక్రమాన్ని స్టార్ మా నిర్వహించింది. ఇందులో అత్యంత తక్కువ సమయం కనిపించిన అభిజీత్ ఇంతవరకు ఏ మీడియాలోనూ కనిపించలేదు. బిగ్ బాస్ సీజన్ 4 విన్నరైన తరువాత మీడియాకు దూరంగా వుంటూ వస్తున్నాడు అభిజీత్.
ఇదే షో నుంచి బయటికి వచ్చిన సొహేల్ హీరోగా ఓ సినిమాని, అఖిల్ సార్థక్ ఓ వెబ్ సిరీస్‌ని ప్రకటించారు. అవినాష్ స్టార్ మాలో వరుస షోలలో అదరగొట్టేస్తున్నాడు. కానీ అభిజీత్ మాత్రం తన వైపు నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజా సమాచారం మేరకు నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అభి మూడు చిత్రాలకు సైన్ చేసినట్టుగా వినిపిస్తోంది. త్వరలోనే వీటికి సంబంధించిన అఫీషియల్ న్యూస్ బయటికి రానున్నట్టు తెలిసింది.
సందర్భవశాత్తూ శేఖర్ కమ్ముల సినిమా 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో అభిజీత్ తల్లిగా అమల అక్కినేని నటించారు. అప్పట్నుంచీ నాగ్‌కు అభిపై సాఫ్ట్ కార్నర్ ఉంది. బిగ్ బాస్ షోలోనూ అది మనకు కనిపించింది. ఇప్పుడు ఏకంగా అతనితో మూడు సినిమాలకు ఆయన ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.
Also Read