రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.. క్రిటికల్ స్టేజ్‌లో బిగ్ బాస్ కంటెస్టెంట్!
on Jul 25, 2021
'బిగ్ బాస్ తమిళ' ఫేమ్ యషికా ఆనంద్, ఆమె ఫ్రెండ్ భవాని శనివారం రాత్రి (జూలై 24) చెన్నైలోని మామల్లపురం సమీపంలో ఇసిఆర్ రహదారిపై డివైడర్‌ను ఢీకొనడంతో వారి కారు బోల్తా పడి తీవ్ర ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలకు గురైన భవానీ అక్కడికక్కడే మరణించారు. 28 ఏళ్ల వల్లిచెట్టి భవానీ హైదరాబాద్ నివాసి. వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన భవానీ గత వారం అమెరికా నుంచి తిరిగి వచ్చి తన స్నేహితులను కలవడానికి చెన్నై వెళ్లారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, యషిక, భవానీతో పాటు, కారులో మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. అయితే, వారెవరనేది ఇంకా తెలియరాలేదు.
గాయపడిని వారిని స్థానికులు వెంటనే పూంజెరిలోని ఎమర్జెన్సీ కేర్ యూనిట్‌కు తరలించారు. అప్పటికే వల్లిచెట్టి భవానీ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. యషిక, మిగతా ఇద్దరు బాధితులను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
శనివారం రాత్రి 11:30 గంటల సమయంలో యషిక, ఆమె స్నేహితులు చెన్నైకి తిరిగి వెళుతుండగా ఇసిఆర్ రోడ్‌లోని సులేరికాడు సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పురుషుల్లో ఒకరు కారును డ్రైవ్ చేస్తున్నారని అనుమానిస్తున్నారు. ఆ కారు రిజిస్ట్రేషన్ నంబర్ TN 01 BK 8632. దెబ్బతిన్న ఎస్యూవీ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మామల్లపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కమల్ హాసన్ హోస్ట్‌గా చేసిన రియాలిటీ షో 'బిగ్ బాస్ తమిళ్ 2' లో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా యషికా ఆనంద్ పాపులర్ అయ్యారు. ఈ ఢిల్లీ అమ్మాయి 'ధురువంగల్ పాతినారు', 'జాంబీ', 'ఇరుట్టు అరాయిల్ మురట్టు కుదు' చిత్రాలలో నటించారు.
Also Read