బిగ్ బాస్ జోక్: అవ్వ.. గంగవ్వను నాగ్ 'అవ్వ' అనడమేంటి?!
on Sep 14, 2020
'బిగ్ బాస్' నాలుగో సీజన్ ఎవర్గ్రీన్ అందగాడు, మన్మథుడు నాగార్జునకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. షో పరంగా ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ, షో బయట ఆయన మీద విమర్శలు వస్తున్నాయి. కొంతమంది గంగవ్వను ఆయన పిలుస్తున్న పిలుపు మీద జోకులు వేస్తున్నారు. ఆయన అసలు వయసును గుర్తు చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
'బిగ్ బాస్' కంటెస్టెంట్లలో అందరికి కంటే గంగవ్వ వయసులో పెద్దవారు. ఆమెకు 60 ఏళ్ళు. కింగ్ నాగార్జున ఆమె కంటే వయసులో ఒక ఏడాది పెద్ద. ప్రస్తుతం నాగ్‌కి 61 ఏళ్ళు. షోలో గంగవ్వను ఆయన 'అవ్వ' అని పిలుస్తున్నారు. "60 ఏళ్ళ గంగవ్వను 61 ఏళ్ళ నాగార్జున 'అవ్వ' అనడమే బిగ్ బాస్ షోలో స్పెషాలిటీ" అని మీమ్ మేకర్లు జోకులు వేస్తున్నారు.
నాగార్జున వయసు గుర్తు చేస్తుండడం అక్కినేని అభిమానులకు నచ్చడం లేదు. వయసుతో సంబంధం లేకుండా యువకులతో పోటీ పడే అందం నాగార్జున సొంతం. స్క్రీన్ మీద నాగార్జునను చూస్తుంటే ఆయన వయసు మీద సెటైర్స్ వేయడం సబబు కాదేమో అనిపిస్తుంది.