నందమూరి అందగాడి చిత్రంలో అల్లరోడు?
on Sep 14, 2020
నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తాజాగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'సింహా', 'లెజెండ్' వంటి భారీ విజయాల తర్వాత వారిద్దరి కలయికలో ముచ్చటగా తర్వాత తన మూడో చిత్రమిది. ఇందులో ఓ కీలక పాత్రలో 'అల్లరి' నరేష్ నటిస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నారట.
కొన్ని రోజులుగా బోయపాటి టీమ్ ఈ సినిమాలో కీలక పాత్ర కోసం యంగ్ హీరో అన్వేషణలో పడింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే క్యారెక్టర్ ఎవరి చేత చేయించాలని ఆలోచనలు చేస్తున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ'లో కీలక పాత్ర చేసిన నవీన్ చంద్ర పేరు ఒకానొక సమయంలో వినిపించింది. అయితే ఇప్పుడు అల్లరోడిని సంప్రదించారట. ప్రస్తుతం డిస్కషన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. అల్లరి నరేష్ ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదని సమాచారం.
మహేష్ బాబు హీరోగా నటించడం 'మహర్షి'లో అతడి స్నేహితుడిగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. బాలకృష్ణ సినిమాలో పాత్ర నచ్చితే తప్పకుండా నటించే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా టైటిల్ దసరాకి ప్రకటిస్తారట. ఇందులో కథానాయిక ఎవరనేది కూడా ఇంకా ప్రకటించలేదు.
Also Read