వరస్ట్ ఫర్ఫార్మెన్స్ తో జైలుపాలైన కెప్టెన్ నోయల్.. గంగవ్వతో ఫైట్ చేసిన మోనాల్!
on Sep 25, 2020
బిగ్ బాస్ సీజన్ 4లో 16వ రోజు ఇంటి సభ్యులకు ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి చాలా టైమ్ తీసుకున్నారు బిగ్ బాస్. ఒక రాత్రంతా మనుషుల టీమ్ సభ్యులు ఇంటిబయటే ఉండాల్సి వచ్చింది. ఉదయమే వేకప్ సాంగ్ గా బైండ్ బ్లాక్ బైండ్ బ్లాక్ సాంగ్ కు స్టెప్పులేశారు. అయితే టీమ్ గా విడిపోయిన రాత్రంతా టాక్స్ పూర్తి చేయడానికి కష్టపడ్డ ఇంటిసభ్యులు ఉదయమే చాలా డల్ గా కనిపించారు. అవినాష్ అమ్మ రాజశేఖర్ ను మాటల్లో పెట్టి అతనికి తెలీకుండానే అతని చార్జింగ్ పెట్టుకున్నాడు. దాంతో అవినాష్ చార్జింగ్ అవుతున్నట్లుగా బీప్ సౌండ్ వచ్చింది. అది గమనించిన దివి "మాస్టర్ మీ చార్జింగ్ పెట్టుకుంటున్నాడు" అని అరిచింది దివి. "చార్జింగ్ పెట్టుకున్నా సోయి లేదు" అంటూ సోహైల్ రాజశేఖర్ ను విమర్శించాడు. దివి అవినాష్‌ను కొట్టింది. అయితే అభిజిత్ నమ్మకద్రోహంతో బాగా హర్ట్ అయిన రాజశేఖర్, ఇప్పుడు అవినాష్ కూడా అలాగే ప్రవర్తించడంతో "లైఫ్‌లో నాశనం అయిపోతావు" అంటూ తిడుతూ, తనతో మాట్లాడవద్దు అంటూ అవినాష్‌కు వార్నింగ్ ఇచ్చాడు. కూల్ చేసేందుకు అవినాష్ నానా తంటాలు పడినా అమ్మ రాజశేఖర్ తమ పట్టు వదలలేదు.
తర్వాత మోనాల్ గంగవ్వ రోబో డ్రెస్‌ను తీసి విసిరేసింది. దాంతో మోనాల్‌పై సివంగిలా లేచింది గంగవ్వ. మోనాల్ పై కుర్చీ ఎత్తేసింది. దాంతో ఆమె డ్రస్ మోనాల్ ఇచ్చేసింది. మరోవైపు రోబోలకు ఎలాంటి చార్జింగ్ ఇవ్వకుండానే మనుషులు వాష్‌రూమ్ వాడేసుకున్నారు. అడ్డువచ్చిన లాస్యను మోనాల్ తోసేయడంతో ఇద్దరూ కింద పడ్డారు. వాటర్, గ్యాస్ వంటి కనెక్షన్స్ ను మోనాల్ కట్ చేసింది. వారించిన అరియానాతో ఫైట్ చేసింది. చార్జింగ్ లేకపోవడంతో అరియానా, కుమార్ సాయి, హారిక, లాస్య, అవినాష్ చచ్చిపోయారు. టాస్క్ పూర్తి అయ్యిందని బజర్ మోగే సమయానికి అభిజిత్, గంగవ్వ బతికే ఉన్నారు.
మొత్తానికి ఎత్తులకు పై ఎత్తులు, వాదనలు, మోసాలు, అరుపులు, కేకలతో ఉక్కు మనిషి టాస్క్ 17వ రోజు పూర్తి చేశారు. టాస్క్ పూర్తి అయ్యే సమయానికి గంగవ్వ, అభిజిత్ బతికే ఉండటంతో రోబో టీమ్ గెలిచినట్లుగా బిగ్ బాస్ ప్రకటించారు. అయితే రాత్రంతా ఇంటి బయట ఉండి, తిండి, నిద్ర లేకుండా గడిపిన తమ శ్రమ అంతా వేస్ట్ అయ్యిందని మనుషుల టీమ్ సభ్యులు బాధ పడ్డారు.
టాస్క్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన సభ్యులుగా అభిజిత్, గంగవ్వ, అవినాష్, హారిక బిగ్ బాస్ మెప్పు పొందారు. వారి నలుగురి పేర్లను హౌస్ కెప్టెన్ గా పోటీ చేసే అర్హత ఉందని బిగ్ బాస్ చెప్పాడు. ఓడిపోయిన మనుషుల టీమ్ సభ్యుల నుంచి వరస్ట్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన వ్యక్తిని గుర్తించమని ఇంటిసభ్యులకు బిగ్ బాస్ సూచించగా నోయల్ దివిని హౌస్ లోకి పంపించాను కాబట్టి నేనే బిగ్ బాస్ అన్నాడు. ఇంటి సభ్యుల్లో కొందరు దివి, సుజాత పేరు చెప్పారు. అయితే చివరికి అందరూ కలిసి నోయల్ పేరు చెప్పడంతో అతనికి జైలు శిక్ష విధించాడు బిగ్ బాస్. ఇంటి ఆవరణలో ఉన్న జైలులోకి నోయల్ వెళ్లాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇంటి సభ్యులు అతనికి ఎలాంటి ఆహారం ఇవ్వవద్దని, రాగులు అతనే విసిరి పిండి చేయాలని, ఆ పిండితో మాత్రమే జావ చేసి అతనికి ఇవ్వాలని బిగ్ బాస్ సూచించాడు.
ఉండాలనిపిస్తలేదు..
ఉక్కు మనిషి టాస్క్ లో బుద్ధిబలంతో దివిని హౌస్ లోకి తీసుకువచ్చిన అభిజిత్ టాస్క్ గెలిచినప్పటికీ చాలా షేమ్ గా ఫీల్ అవుతున్నాడు. టాస్క్ గెలవడానికి తాను చేసిన ప్రయత్నాన్ని చీటింగ్ అంటూ మరో టీమ్ వాళ్లు దూషించడం బాధగా ఉన్నదని హారికతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాడు. "నువ్వు చాలాబాగా టాస్క్ ను పూర్తి చేశావు. నీ వల్లే మన టీమ్ గెలిచింది" అంటూ హారిక అభిని మెచ్చుకుంది.
బందీని కాను నేను.. సంధించి వస్తాను
"బందీని కాను నేను.. సంధించి వస్తాను, చెరసాలలో వేసినా చరిత్ర రాస్తాను" అంటూ సాంగ్ పాడుతూ తనకు తాను ధైర్యం తెచ్చుకునే ప్రయత్నం చేశాడు నోయల్. ఇంటి సభ్యులతో హుషారు నింపేలా నోయల్ జైలులో ఉండటంతో దిగులుగా గంగవ్వ, దివి, అమ్మ రాజశేఖర్ జైలు బయట కూర్చున్నారు. ఇంతలో ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ముఖానికి మాస్క్ పెట్టుకున్న అమ్మాయి హౌస్ లోకి అడుగుపెట్టింది.
రేపటి ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన ఆమెను ఆహ్వానిస్తూ స్టెప్పులు వేసే సీన్ ను ప్రోమోగా వేశారు. మరి ఆ అమ్మాయి ఎవరు అన్నది తెలుసుకోవాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ చూడాల్సిందే..