వచ్చే వారమే బిగ్ బాస్ 14 ఫైనల్?
on Nov 28, 2020
భారతీయ టెలివిజన్‌లో అత్యంత వివాదాస్పదమైన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ 14 రాబోయే ఎపిసోడ్లో మరో షాకర్ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. షో నిర్వాహకులు రిలీజ్ చేసిన ప్రోమో ప్రకారం, హోస్ట్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 14 ఫైనల్ వచ్చే వారం ఉంటుందని హౌస్‌మేట్స్‌కు చెప్పడం కనిపిస్తుంది.
"అబ్ సీన్ పల్టేగా" అని అనౌన్స్ చేస్తూ, హౌస్‌మేట్స్‌తో వారు ఊహించిన దానికన్నా త్వరగా ఫైనల్ జరుగుతుందని, ఆ ఫైనల్లో పోటీదారులుగా నలుగురు మాత్రమే ఆడతారనీ సల్మాన్ చెబుతారు. దీని అర్థం మిగతా హౌస్మేట్స్ ప్రయాణం కచ్చితంగా ముగింపుకు వచ్చినట్లే. తద్వారా పోటీ మరింత కఠినతరం కానున్నది.
వీకెండ్ కా వార్ ఎపిసోడ్లో చాలా మంది గెస్ట్‌లు షోలోకి ప్రవేశించి, ఎక్స్పర్ట్ ప్యానల్లో భాగం కావడాన్ని మనం చూడొచ్చు. ఆ ప్యానెల్ హౌస్‌మేట్స్‌ను పరీక్షించి సలహాలు ఇస్తుంది. ఈ ప్యానల్లో మాజీ కంటెస్టెంట్లు కామ్యా పంజాబీ, దేవొలీనా భట్టాచార్య, కవితా కౌశిక్ భర్త రోన్నిత్ బిశ్వాస్, ప్రొడ్యూసర్ సందీప్ సిక్చంద్ ఉంటారు.
ఈ వీకెండ్ ఎపిసోడ్లో ఒకప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ జాస్మిన్ భాసిన్, రుబీనా దిలైక్ మధ్య పెద్ద యుద్ధం కూడా కనిపించనుంది. ఈసారి అది సల్మాన్ ఖాన్ సమక్షంలో జరగనుంది. ఏదేమైనా తన ఫ్రెండ్స్‌కు సపోర్ట్ చేస్తానని రుబీనా అంటే, ఏం చేయాలి, ఆట ఎలా ఆడాలనే విషయాai నేర్చుకోడానికి తాను స్కూల్‌కు రాలేదని కౌంటర్ ఇస్తుంది జాస్మిన్.
ప్రస్తుతం బిగ్ బాస్ 14 హౌస్‌లో తొమ్మిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు.. రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా, జాస్మిన్ భాసిన్, అలీ గోని, ఐజాజ్ ఖాన్, పవిత్ర పూనియా, రాహుల్ వైద్య, నిక్కీ తంబోలి, కవితా కౌశిక్.
Also Read