భోళా మేనియా షురూ.. రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది!
on May 30, 2023
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భోళా శంకర్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమిళ చిత్రం 'వేదాళం'కి రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఆగస్టు 11 న విడుదల చేయనున్నట్లు గతంలో చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఇటీవల ఈ సినిమా దసరాకు వాయిదా పడే అవకాశముందని వార్తలు వినిపించాయి. తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న 'భోళా శంకర్' మూవీ ప్రమోషన్స్ కి పాటలతో శ్రీకారం చుడుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'భోళా మేనియా త్వరలోనే ప్రారంభం కానుంది' అంటూ ఓ కొత్త పోస్టర్ ను వదిలారు. బ్యాక్ గ్రౌండ్ లో జాతర వాతావరణం తలపిస్తుండగా, చిరంజీవి అటువైపు తిరిగి వెనుక జేబుల్లో చేతులు పెట్టుకొని ఉన్న డ్యాన్సింగ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. పోస్టర్ ని బట్టి చూస్తే ఇది మూవీలో ఇంట్రో సాంగ్ అనిపిస్తోంది. అలాగే పోస్టర్ లో సినిమాని ఆగస్టు 11 న విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 'భోళా శంకర్' వాయిదా అనే వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరంజీవి.. 'భోళా శంకర్'తో ఆ జోరుని కొనసాగిస్తారేమో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
