దీపావళికి 'భీమ్లా నాయక్' టీజర్!
on Oct 28, 2021

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రధారులుగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'భీమ్లా నాయక్'. ఇందులో భీమ్లా నాయక్ పాత్రలో పవన్, డేనియల్ శేఖర్ పాత్రలో రానా కనిపించనున్నారు. ఈ పాత్రలను పరిచయం చేస్తూ ఇప్పటికే విడుదల చేసిన వీడియోస్ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ మూవీ టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది.
పోస్టర్, సాంగ్, వీడియో ఇలా 'భీమ్లా నాయక్' మూవీ నుంచి విడుదలయ్యే ప్రతిదీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక త్వరలో టీజర్ తో అలరించడానికి మూవీ టీమ్ సిద్ధమైందని టాక్ వినిపిస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 న ఈ మూవీ టీజర్ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ టీజర్ డైలాగ్స్, యాక్షన్ లో పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .
'భీమ్లా నాయక్'లో పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తుండగా.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



