కాకినాడ పోర్టులో 'భగవంత్ కేసరి'!
on Sep 22, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే 'భగవంత్ కేసరి' షూటింగ్ దాదాపు పూర్తయింది. చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెండింగ్ ఉండగా, ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ షూట్ లో బాలకృష్ణ పాల్గొన్నారు. ఇక ఇప్పుడు 'భగవంత్ కేసరి' టీం కాకినాడలో అడుగుపెట్టింది. రేపు(సెప్టెంబర్ 23) కాకినాడ పోర్టు లో భగవంత్ కేసరి వన్ డే ప్యాచ్ వర్క్ జరగనుందట. బాలయ్య లేకుండా జస్ట్ యూనిట్ మాత్రమే పాల్గొననుందని సమాచారం.
అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఆర్ఆర్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 12 నాటికి అన్ని పనులు పూర్తి చేసుకొని, అక్టోబర్ 19న భగవంత్ కేసరి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
