ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఓటీటీలోకి అఖిల్ 'ఏజెంట్'!
on Sep 22, 2023
ఈమధ్య జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. కానీ 'ఏజెంట్' మాత్రం థియేటర్లలో విడుదలై ఐదు నెలలు అవుతున్నా, ఇంతవరకు ఓటీటీలోకి రాలేదు. అసలు ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ విడుదలకు ముహూర్తం ఖరారైంది.
అక్కినేని అఖిల్, మమ్ముట్టి, సాక్షి వైద్యా ప్రధాన పాత్రల్లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ఏజెంట్'. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలై పరాజయం పాలైంది. అయినప్పటికీ థియేటర్లలో మిస్ అయినవారు.. ఈ సినిమాని ఓటీటీలో చూడటానికి బాగానే ఆసక్తి చూపారు. కానీ ఏవో కారణాల వల్ల ఓటీటీ విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. నెలలు గడిచిపోవడంతో ఈమధ్య అసలు ఆ సినిమా ఊసే లేదు. దాదాపు అందరూ మర్చిపోతున్న సమయంలో సడెన్ గా 'ఏజెంట్' ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఈ సినిమాని సెప్టెంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా సోనీ లివ్ ప్రకటించింది. మరి ఇంత ఆలస్యంగా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న ఏజెంట్ కి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
