ఉయ్యాలో ఉయ్యాలా.. సెంటిమెంట్ తో టచ్ చేసిన బాలయ్య
on Oct 4, 2023
నందమూరి నట సింహం బాలకృష్ణ అమ్ముల పొదిలో నుంచి వస్తున్న తాజా మూవీ భగవంత్ కేసరి. సినిమా రిలీజ్ దగ్గర పడేకొద్దీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని మేకర్స్ ఒక లెవెల్లో స్టార్ట్ చేసారు. రెండు రోజులకొకసారి అయినా కూడా భగవంత్ కేసరి మూవీ కి సంబంధించిన ఏదో ఒక న్యూస్ బయటికి వస్తు నందమూరి అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది. ఇప్పుడు వాళ్ళ ఆనందాన్ని మరింత పెంచేలా భగవంత్ కేసరి మూవీ నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ అవ్వటమే కాదు కొన్ని డౌట్స్ కి పూర్తి క్లారిఫై ని కూడా ఇచ్చింది.
విజయదశమి కానుకగా అక్టోబర్ 19 న బాలయ్య,అనిల్ రావిపూడిల భగవంత్ కేసరి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుందనే విషయం అందరికి తెలిసిందే. ట్రైలర్ కూడా మరికొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది .అలాగే ఈ మూవీ నుంచి ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయ్యి సంగీత అభిమానులని ఉర్రుతలూగిస్తుంది. ఇప్పుడు రెండో సాంగ్ రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే రికార్డు స్థాయిలో వ్యూయర్స్ ని సంపాదించింది. ఉయ్యాలో ఉయ్యాలా అనే పల్లవితో స్టార్ట్ అయిన సాంగ్ లో బాలకృష్ణ సూపర్ పెరఫార్మెన్సు ని ఇచ్చి సినిమా మీద మరిన్ని అంచనాల్ని పెంచాడు. అలాగే ఈ సాంగ్ ద్వారా ప్రేక్షకులకి వచ్చిన క్లారిఫై ఏంటంటే ఒక చిన్న పాప తో ఉయ్యాలో ఉయ్యాలా అనే పాట ప్రారంభించిన బాలయ్య అదే పాట కంటిన్యుటీ లో ఆ పాప పెరిగి పెద్దది అవుతుంది. ఆ పాప రోల్ లో శ్రీ లీల నటించింది. సో ఆడియన్స్ కి ఉన్న కొన్ని డౌట్స్ కి మేకర్స్ క్లారిఫై ఇచ్చినట్టయ్యింది. సాంగ్ మాత్రం సూపర్ గా ఉంది.అలాగే సాంగ్ లో బాలయ్య క్లాస్ స్టెప్స్ కూడా సూపర్ గా ఉన్నాయి.మీరు కూడా ఒక లుక్ వెయ్యండి .అనంత శ్రీరామ్ ఆ పాటని రాయగా ఎస్.పి చరణ్ అద్భుతంగా పాడాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
