ఆ దర్శకుడిని టార్గెట్ చేసిన బండ్ల గణేష్
on Jan 30, 2017
ఇండస్ట్రీలో దర్శకులు ఇన్ని రాజభోగాలు అనుభవిస్తున్నారంటే అందుకు కారణంగా నిస్సందేహంగా నిర్మాతలే..అందుకే చాలా మంది దర్శకులు నిర్మాతల పట్ల అభిమానాన్ని చూపిస్తుంటారు..పరిశ్రమలో దర్శకుల నిర్మాతలుగా ముద్రపడిన వారు..నిర్మాతల దర్శకులుగా ముద్రపడిన వారు చాలామందే ఉన్నారు..ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..అందరు దర్శకనిర్మాతలకు అంత బాగా సెట్ అవ్వకపోవచ్చు..కొందరు తమ ప్రవర్తనతో నిర్మాతలకు ఫ్రెండ్స్‌గా మారిపోతే..ఇంకొందరు అదే ప్రవర్తనతో తలబొప్పి కట్టిస్తుంటారు.
తాజాగా బండ్ల గణేష్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో తనకు నచ్చిన దర్శకులు గురించి..నచ్చని దర్శకుల గురించి చెప్పాడు..పూరీ జగన్నాథ్, హరీశ్ శంకర్, శ్రీనువైట్ల, పరశురాం నా ఫేవరేట్ డైరెక్టర్స్..కానీ ఓ దర్శకుడంటే మాత్రం ఒళ్లు మంట..అతనికి రాత్రయితే మందు , డ్రగ్స్ తప్పనిసరి. నాలుగు ఇంగ్లీష్ సినిమాలు చూసేసి ఫ్రేములు పెట్టేస్తాడు..రోజుల తరబడి అలా తీస్తూనే ఉంటాడు..అటువంటి వారికి దేవుడు కూడా హిట్టివ్వడూ అంటూ ఆ దర్శకుడి మీద తన అక్కసు మాత్రం వెళ్లగక్కాడు..ఇంతకీ మనోడు ఆ స్థాయిలో ఏకేసిన ఆ డైరెక్టర్ ఎవరా అని ఫిలింనగర్లో చర్చించుకుంటున్నారు.