ఘనంగా నాగచైతన్య-సమంతల నిశ్చితార్థం
on Jan 29, 2017
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. ఏ మాయ చేశావే అంటూ పలకరించిన ఆ జోడి నిజ జీవితంలోనూ ఒక్కటైంది. అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్య..స్టార్ హీరోయిన్ సమంతల నిశ్చితార్థం నిన్న హైదరాబాద్లోని ఎన్.కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో చైతూ, సమ్లు ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కున్నారు. సమంతకు ఉంగరాన్ని తొడిగిన వెంటనే నాగచైతన్య ఆమెను ఆనందంతో ముద్దడారు. ఈ కార్యక్రమాన్ని హిందూ, క్రైస్తవ మతాచారాల ప్రకారం నిర్వహించారు. త్వరలోనే వీరిద్దరి వివాహం హైదరాబాద్లో జరగనుంది.