శ్రియను ఫిక్స్ చేసిన బాలయ్య..!
on Jun 7, 2016
.jpg)
బాలయ్య శాతకర్ణి సినిమాకు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ అయిపోయింది. అయితే ఇంకా హీరోయిన్ ను ఫైనలైజ్ చేయకపోవడం విచిత్రమే. అగ్రహీరో సినిమాకు సాధారణంగా క్యాస్టింగ్ అంతా అయిపోయాకే షూటింగ్ కు వెళ్తారు. ప్రస్తుతం శాతకర్ణి మాత్రం, హీరోయిన్లు లేని వార్ సీక్వెన్స్ లు ముందు పూర్తిచేసేశాడు. హీరోయిన్స్ గా అనుష్క, నయనతార లాంటి వాళ్ల పేర్లు వినబడినా, వాళ్లెవరూ కూడా ఫైనలైజ్ అవలేదు. చివరిగా డైరెక్టర్ క్రిష్ అన్వేషణ శ్రియ దగ్గర ఆగింది. ప్రస్తుతం ఏ ఆఫర్లు లేక ఖాళీగానే ఉన్న ఈ భామ, ఎన్ని డేట్స్ కావాలన్నా ఇస్తుంది. పైపెచ్చు బాలయ్య, శ్రియ జంట చెన్నకేశవరెడ్డితో ఆకట్టుకున్నారు. అందుకే బాలయ్య కూడా ఆమెకే ఓటు వేశాడట. జూన్ 10 న తన పుట్టినరోజు సందర్బంగా ఈ విషయాన్ని ఎనౌన్స్ చేస్తాడని సమాచారం. మొత్తమ్మీద అటు ఇటు తిరిగి, చివరకు శాతకర్ణి హీరోయిన్ వేట శ్రియ దగ్గర ఆగిందన్న మాట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



